ఆర్ ఆర్ ఆర్ జార్జియా షెడ్యూల్ ఫిక్స్ అయిందిగా

ఆర్ ఆర్ ఆర్ జార్జియా షెడ్యూల్ ఫిక్స్ అయిందిగా
ఆర్ ఆర్ ఆర్ జార్జియా షెడ్యూల్ ఫిక్స్ అయిందిగా

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియన్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను పిక్చరైజ్ చేయాల్సి ఉంది. ఒక పాటను రామ్ చరణ్, అలియా భట్ ల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరిస్తారు.

అలాగే మరో సాంగ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మీద ఉండే ఇంట్రడక్షన్ సాంగ్ ను జార్జియాలో చిత్రీకరిస్తారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈ సాంగ్ షూట్ కోసం ఈ నెల 29న జార్జియా వెళ్లనుంది. అక్కడే రెండు వారాల పాటు సాంగ్ ను షూట్ చేస్తారు. మళ్ళీ ఆగస్ట్ మూడో వారంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ హైదరాబాద్ చేరుకుంటుంది.

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ను అక్టోబర్ 13న విడుదల చేయనున్న విషయం తెల్సిందే. మొత్తం ఐదు భాషల్లో చిత్రం విడుదలవుతోంది.