స‌రిగ‌మ సినిమాస్‌కు `ఆర్ఆర్ఆర్‌` ఓవర్సీస్ హ‌క్కులు

స‌రిగ‌మ సినిమాస్‌కు `ఆర్ఆర్ఆర్‌` ఓవర్సీస్ హ‌క్కులు
స‌రిగ‌మ సినిమాస్‌కు `ఆర్ఆర్ఆర్‌` ఓవర్సీస్ హ‌క్కులు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌`. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. `రౌద్రం ర‌ణం రుధిరం`గా వెండితెర‌పై రాజ‌మౌళి ఆవిష్క‌రిస్తున్న రోమాంచిత విజువ‌ల్ వండ‌ర్ ఇది. బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్‌, హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన భీం ఫ‌ర్ రామ‌రాజు, రామ‌రాజు ఫ‌ర్ భీం వీడియోలు సినిమా విజువ‌ల్ వండ‌ర్‌గా వుండ‌బోతోంద‌నే సంకేతాల్ని అందించింది. దీంతో ఈ సినిమాపై వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో రికార్డు స్థాయి బిజినెస్ ఈ సినిమాకు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ హ‌క్కులు మిన‌హా దాదాపు 900 కోట్ల మేర బిజినెస్ జ‌రిగి సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన యూఎస్ థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని కూడా అమ్మేశారు.

ఈ మూవీకి సంబంధించిన ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని సరిగ‌మ సినిమాస్, ర‌ఫ్తార్ క్రియేష‌న్స్ సంస్థ‌లు సొంతం చేసుకున్నాయి. ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మూవీ ప్రీమియ‌ర్ ‌ని అక్టోబ‌ర్ 12న ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.