కండలు అవసరం లేని “ఆర్ఆర్ఆర్”?


RRR
RRR

దర్శక ధీరుడు “రాజమౌళి” తెలుగు సినిమాని ఆకాశానికి ఎక్కించాడు. ఏదైనా తెలుగు సినిమా చరిత్ర అనగానే మొదట నిలిచే సినిమా, దర్శకుడి పేరు రాజమౌళి.. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” గురించే ప్రతి ఒక్కలి ఎదురుచూపు.

దాదాపు షూటింగ్ 50 శాతం పూర్తి అయ్యిందని రాజమౌళి గారు అన్నారు.. అదంతా బాగానే ఉంది కానీ , ఇంతకీ ఇప్పటి వరకు పాత్రలు మాత్రమే చెప్పిన రాజమౌళి గారు, హీరోలకి భారీ కండల్ని ఎందుకు పెట్టలేదు? అని సందేహం కలుగుతుంది.

దర్శకధీరుడు రాజమౌళి నేతృత్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంతో దూసుకెళుతుంది. ఇటీవలే బల్గెరియా వెళ్లిన చిత్ర బృందం అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. అక్కడి షెడ్యూల్ పూర్తి అయ్యిందని, తర్వాత షెడ్యూల్ రామ్ చరణ్ మీద ఉంటుంది అని చెప్పారు.

మరి ఒక పక్క రామ్ చరణ్ గారేమో చిరంజీవి “సైరా” విడుదల చూసుకుంటున్నారు. చరణ్ గారి ఎపిసోడ్స్ ఇంకా టైం పట్టొచ్చు అంటున్నారు నిర్మాతలు. కాగా బాహుబలిలో ప్రభాస్, రానాలను కండలు తిరిగిన బీస్ట్ మోడ్ లో ప్రెసెంట్ చేసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను సాధారణ శరీర సౌష్టవం కలిగినవారిగా చూపించబోతున్నాడని అర్థం అవుతుంది. కానీ తాజాగా బయటకివచ్చిన ఫోటో ఒకటి ఎన్టీఆర్ ఒళ్ళు చేయకపోగా ఇంకా చిక్కిపోయినట్లు అనిపించారు. దీనితో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ లో సాధారణ శరీరాలలోతోనే కనిపిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇతర తారాగణంలో అజయ్ దేవ్ గణ్, అలియా భట్, సముద్ర ఖని వంటి నటులు కనిపించనున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది.