మళ్ళీ అదే తప్పు చేస్తున్న త్రివిక్రమ్


Rs 100 Cr budget for Jr.NTR and Trivikram filmఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి అనే భారీ బడ్జెట్ చిత్రం చేసి అటు బయ్యర్ల ను ఇటు నిర్మాతను నిండా ముంచేసిన దర్శకులు త్రివిక్రమ్ తాజాగా మరోసారి అదే తప్పు చేస్తున్నాడు . అజ్ఞాతవాసి చిత్ర బడ్జెట్ ని అంతకంతకు పెంచుకుంటూ పోయిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ……. వంద కోట్లు . అవును 100 కోట్ల బడ్జెట్ అంట !

 

ఎందుకంటే హీరో , హీరోయిన్ లతో పాటుగా మిగతా నటీనటులు , సాంకేతిక నిపుణులకు రెమ్యునరేషన్ పరంగా దాదాపుగా 50 కోట్లు పోతున్నాయట అంటే మిగతా యాభై కోట్ల లో రిలీజ్ నాటికీ అన్ని వడ్డీలు కలుపుకొని , మేకింగ్ కు అయ్యే ఖర్చు అన్నమాట అంటే మొత్తంగా వంద కోట్ల బడ్జెట్ . సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే వచ్చేది వంద కోట్ల పైన ఒకవేళ అటు ఇటైతే ఇంకేమైనా ఉందా ? భారీ చిత్రాలు చేస్తున్నారు కానీ భారీ విజయాలు సాధించే సినిమాలు తక్కువే ! మరి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమా ఏమౌతుందో చూడాలి .