హీటెక్కిస్తున్న హిట్ సుంద‌రి!


హీటెక్కిస్తున్న హిట్ సుంద‌రి!
హీటెక్కిస్తున్న హిట్ సుంద‌రి!

`చిల‌సౌ` చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ రుహానీ శ‌ర్మ‌. సుశాంత్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ మూవీతో రుహానీ మంచి మార్కులే కొట్టేసింది. ప‌క్కింటి అమ్మాయిలా ఆక‌ట్టుకుని టాలీవుడ్‌లో మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత విశ్వ‌క్‌సేన్‌తో క‌లిసి చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌` కూడా స‌క్సెస్ కావ‌డంతో ఇక్క‌డే పాగా వేసేసింది.

లాస్ట్‌ ఇయ‌ర్ `క‌మ‌ల‌` చిత్రంతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది `ఆగ్రా` మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం తెలుగులో `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రంలో న‌టిస్తోంది. త‌న పాపులారిటీని పెంచుకోవ‌డానికి నిత్యం సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో యాక్టీవ్‌గా వుంటున్న నేహాశ‌ర్మ తాజాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో చేసిన ఫొటో షూట్ స‌ర్‌ప్రైజ్ చేస్తోంది.

స్పోర్ట్స్ బ్లాక్ డ్రెస్సులో అందాల విందు చేస్తున్న రుహానీ పిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోస్‌ని రుహానీ ఇన్ స్టా వేదిక‌గా అబిమానుల‌తో పంచుకుంది. ఈ `హిట్‌` సుంద‌రి అందాల‌కు నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. గజిబిజి జుట్టు, నల్ల దుస్తులతో రుహానీ మ‌రింత అందంగా వేడిపుట్టిస్తోంది. `నూటొక్క జిల్లాల అందగాడు`తో రుహానీ ద‌శ తిర‌గ‌డం గ్యారెంటీ అంటున్నారు.

 

View this post on Instagram

 

📸 @tejasnerurkarr 💕

A post shared by Ruhani Sharma (@ruhanisharma94) on