రూలర్ ఫస్ట్ వీకెండ్: మరో డిజాస్టర్ వైపుగా బాలయ్యరూలర్ ఫస్ట్ వీకెండ్: మరో డిజాస్టర్ వైపుగా బాలయ్య
రూలర్ ఫస్ట్ వీకెండ్: మరో డిజాస్టర్ వైపుగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది మరో డిజాస్టర్ ను అందుకోబోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో దారుణమైన పరాజయాన్ని ఫేస్ చేసిన బాలకృష్ణ, రూలర్ తో అదే స్థాయి ప్లాప్ ను ఎదుర్కోబోతున్నాడు. నిజానికి బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జై సింహా హిట్ అవ్వడంతో, రూలర్ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తీవ్రంగా నిరాశచెందారు. తొలి రోజు నుండే ఈ సినిమాకు దారుణమైన టాక్ మొదలైంది. సినిమాకు రేటింగులు కూడా చాలా తక్కువగా వచ్చాయి.

అయినా కానీ తొలిరోజు రూలర్ వసూళ్లు బాగున్నాయి. తొలిరోజు 5 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టింది రూలర్. తొలిరోజు బాలయ్య మాస్ ఇమేజ్ కారణంగా పర్వాలేదనిపించిన రూలర్ కలెక్షన్స్, రెండో రోజు నుండి అధమ స్థాయికి పడిపోయింది. రెండో రోజు కేవలం 1 కోటి షేర్ వచ్చింది. ఆదివారం పరిస్థితిలో మార్పు లేదు. నిన్న కూడా 1 కోటి రావడంతో ఇక ఈ సినిమా పైకి లేవడం కష్టమనే భావనకు వచ్చేసారు. ఈరోజు నుండి వర్కింగ్ డేస్ కావడంతో క్రిస్మస్ కు సెలవున్నా కానీ మరో రెండు సినిమాలు విడుదల కానుండడంతో రూలర్ పరిస్థితి డిజాస్టర్ కు తక్కువ కాదు అని అంటున్నారు.

రూలర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఒకసారి చూసుకుంటే..

నైజాం : 1.32 కోట్లు

సీడెడ్ : 1.59 కోట్లు

గుంటూరు : 1.49 కోట్లు

ఉత్తరాంధ్ర : 66 లక్షలు

తూర్పు గోదావరి : 41 లక్షలు

పశ్చిమ గోదావరి : 34.5 లక్షలు

కృష్ణా : 33 లక్షలు

నెల్లూరు : 31.5 లక్షలు

ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ : 6.46కోట్లు

కర్ణాటక + ఇండియా : 50 లక్షలు

ఓవర్సీస్ : 16 లక్షలు

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ : 7.12 కోట్లు

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన తర్వాతి చిత్రం కోసం సన్నద్ధమవుతున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.