రూలర్ మూవీ క్లోజింగ్ బిజినెస్ డీటెయిల్స్


Ruler movie Closing Collections report
Ruler movie Closing Collections report

నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా డిసెంబర్ 20న విడుదలైన విషయం తెల్సిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. నందమూరి బాలకృష్ణ సినిమాలు 2019లో రెండు డిజాస్టర్లుగా నిలిచాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు 2019 మొదట్లో విడుదలై భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో రూలర్ సినిమాపై డీసెంట్ అంచనాలని పెంచుకున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గతంలో చేసిన జైసింహ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రూలర్ కూడా బాగా ఆడుతుందని ఊహించారు ప్రేక్షకులు.

అయితే పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. పెట్టుబడిలో కనీసం మూడో వంతు కలెక్షన్స్ ను సాధించడంలో కూడా విఫలమైంది. ఫుల్ రన్ లో కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డీలా పడింది. కంటెంట్ వీక్ గా ఉండడంతో క్రిస్మస్ సెలవుల అడ్వాంటేజ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.

రూలర్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం :Rs 1.35 Cr
సీడెడ్ : Rs 1.95 Cr
నెల్లూరు: Rs 0.36 Cr
కృష్ణ: Rs 0.41 Cr
గుంటూరు: Rs 1.35 Cr
వైజాగ్ : Rs 0.50 Cr
ఈస్ట్ : Rs 0.40 Cr
వెస్ట్ : Rs  0.40 Cr
ఆంధ్ర+తెలంగాణ :  Rs 6.72 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 0.50 Cr
ఓవర్సీస్: Rs 0.34 Cr
వరల్డ్ వైడ్ : Rs 7.56 Cr

రూలర్ డిజిపోయింట్ చేసినా బాలయ్య అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యే వార్త. ఇప్పుడు బాలయ్య తన తర్వాతి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనుండడంతో అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.