పవర్ కట్ అవ్వుద్ది.. – రూలర్ కొత్త ట్రైలర్ హైలెట్స్


ruler new trailer highlights
ruler new trailer highlights

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా జై సింహా సినిమా తరువాత వస్తున్న మరో చిత్రం రూలర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవలే వైజాగ్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో కూడా ఎప్పటిలాగే బాలయ్య తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఎన్ని ఉన్నా, ఇది రైతుల సమస్యలపై ఉంటుందని ప్రకటించారు.ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన మరొక ట్రైలర్ కూడా ఇప్పుడు అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

“సామాన్య ప్రజలు కూడా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు అంటే కారణం ఆకలి” అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్

2000 తెలుగు కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు అని వేదిక చెప్పడం,

గ్లోబ్ ని గోలి లా చేసుకుని ఆడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీకు తాగుబోతులా కనిపిస్తున్నాడా అని ; నీకుండే ఆ పవర్ 5 ఏళ్ళకు కట్ అయిపోద్దిరా పోరంబోకు..”

అని బాలకృష్ణ 2 రకాల పాత్రలలో చెప్పిన డైలాగ్స్ సూపర్ గా పేలాయి. ఇంకా ఇందులో బాలకృష్ణ చేసిన ట్రైన్ ఫైట్ విజువల్స్ ని కూడా చూపించారు. మొత్తానికి  బాలకృష్ణ తన ఫాన్స్ కి ముందుగానే న్యూ ఇయర్ & సంక్రాంతి ఫెస్టివల్ గిఫ్ట్ ముందే ఇచ్చేసినట్లుగా ఉంది. ఇక రూలర్ రిలీజ్ అయ్యి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం..!