నిహారిక – నాగశౌర్య లపై మళ్ళీ రాతలు


rumours again niharika and nagashouryaమెగా డాటర్ నిహారిక – హీరో నాగశౌర్య పై మళ్ళీ రాతలు రాసి సంచలనం సృష్టించింది ఒక పత్రిక . ప్రజల్లో బాగా పేరున్న ఆ పత్రిక ఇలా అడ్డదిడ్డంగా రాయడం సంచలనమే అయ్యింది . ఇంతకీ ఆ మీడియా కథనం ఏంటంటే ……. నిహారిక – నాగశౌర్య లు బాగా ప్రేమించుకున్నారని కానీ ఇద్దరికీ కూడా కెరీర్ కూడా అంతే ముఖ్యం కాబట్టి ఆ ప్రేమని వదులుకొని సినిమాలు చేసుకుంటున్నారని . పెద్ద పెద్ద ఫోటోలు వేసి మరీ రాసారు దాంతో మెగా కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ మీడియా మీద .

నిహారిక – నాగశౌర్య జంటగా ఒక మనసు చిత్రంలో నటించారు . నిహారిక ఆ చిత్రంతో పరిచయం అవుతూ రూపొందిన చిత్రం కాబట్టి ఆ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది నిహారిక. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని రకరకాల కథనాలు వెలువడ్డాయి అప్పట్లో . ఆ వార్తలు మరీ ఎక్కువ కావడంతో ఇద్దరు కూడా ఆ వార్తలను ఖండిస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసారు . దాంతో ఆ వార్తలు సద్దుమణిగాయి కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఓ పత్రిక సంచలన కథనం రాసి మెగా కుటుంబాన్ని షేక్ చేసింది . కేవలం కెరీర్ కోసం , సినిమాల కోసం మాత్రమే ప్రేమని పక్కన పెట్టారని త్యాగం చేసారని అన్నట్లుగా కథనం రాసారు . ఈ వార్త నాగబాబు ని బాగా ఆవేశానికి లోనయ్యేలా చేసింది .

English Title: rumours again niharika and nagashourya