జూనియర్ ఎన్టీఆర్ జగన్ ని కలవనున్నాడా ?YS-Jagan-And-Jr-Ntr
YS Jagan And Jr Ntr

జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలవనున్నట్లు జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి . ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని నియమించనున్నట్లు , దానికి ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు , మంత్రి కొడాలి నాని సహకారం అందిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి .

ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . ఇక మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు చాలా సన్నిహితుడు దాంతో ఎన్టీఆర్ ని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే ఇది అంత ఈజీ వ్యవహారం కాదు ఎందుకంటే జూనియర్ ఒక్కసారి ఒప్పుకుంటే ఇప్పటికే ఉందా ? లేనట్లుగా ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ గా మటాష్ అవ్వడం ఖాయం .