సినిమా తీసేదేమైనా ఉందా ? ప్రకటనలకే పరిమితమా ?


 

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నాడు అలాగే ఏవో కొన్ని పోస్టర్ లను రిలీజ్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నాడు తప్ప ఇంతవరకు సినిమా తీసిన దాఖలాలు లేవు ప్రకటించిన వివాదాస్పద చిత్రాల తాలూకు . రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే ” లక్ష్మీస్ వీరగ్రంథం ” అంటూ ప్రకటన చేసాడు . ఓ ఆడియో రిలీజ్ చేసాడు మళ్ళీ ఆ సినిమా ఏమైందో ఇంతవరకు తెలీదు .

దాని సంగతి పక్కన పెట్టేసాడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ అని కొంతమంది ప్రకటించగానే ”శశిలలిత ” అనే టైటిల్ తో మరో చిత్రం ప్రకటించాడు . పోస్టర్ రిలీజ్ చేసాడు కూడా …. సైలెంట్ అయిపోయాడు కూడా ఇక ఇప్పుడేమో మళ్ళీ శశిలలిత త్వరలోనే షూటింగ్ అంటూ మరోసారి ప్రకటించాడు . ఇదే కాదు మరో సినిమా కూడా ప్రకటించాడు కానీ అది కూడా పట్టాలెక్క లేదు . దాంతో కేతిరెడ్డి సినిమా తీసేది ఏమైనా ఉందా ? లేక ఇలా ప్రకటనలకే పరిమితమా ? అంటూ వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు .