రాంచరణ్ కు గాయాలు అని పుకార్లు


Rumours on Ramcharan
Rumours on Ramcharan

హీరో రాంచరణ్ కు మరోసారి గాయాలు అయ్యాయని పుకార్లు షికారు చేస్తున్నాయి . ఒక జాతీయ మీడియా చరణ్ గాయపడినట్లు పేర్కొనడంతో అది వైరల్ గా మారింది . ప్రస్తుతం రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పటికే చరణ్ గాయం కారణంగా ఆర్ ఆర్ ఆర్ వాయిదాపడింది . మళ్ళీ గాయం అంటే …….. అన్న ఊహే అభిమానులను కలిచి వేస్తోంది .

అయితే రాంచరణ్ కు ఎలాంటి గాయాలు కాలేదని , నిన్న అలాగే ఈరోజు కూడా ఆర్ ఆర్ ఆర్  షూటింగ్ లో పాల్గొన్నాడని ఆ చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది . అయితే షూటింగ్ లో మాత్రం చరణ్ కు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది . అయితే ఈ గాయం పెద్దది కాదు అలాగని విశ్రాంతి తీసుకునేంతది కానే కాదు దాంతో ఆ పుకార్లని కొట్టి పడేస్తున్నారు ఆర్ ఆర్ ఆర్ బృందం .