రష్మిక ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్


rumours on rashmika mandannaగీత గోవిందం చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భామ రష్మిక మండన ,అయితే ఈ సినిమాలో నటించే సమయంలోనే కన్నడ నటుడు రక్షిత్ ని పెళ్లాడటానికి నిర్ణయించుకుంది. ఇద్దరూ కిరాక్ పార్టీ చిత్రం చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు ఆ ప్రేమని ముందుకు కొనసాగించడానికి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు ఇక త్వరలోనే పెళ్లి అని అనుకుంటున్న సమయంలో గీత గోవిందం పెద్ద హిట్ కావడం , రష్మిక కు వెల్లువలా అవకాశాలు వచ్చి పడుతుండటంతో ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి .

అసలు కొద్దికాలం క్రితమే ఎంగేజ్ మెంట్ రద్దు కాబోతున్నట్లు వార్తలు వచ్చిన సమయంలో అలాంటిదేమి లేదని సమాధానం ఇచ్చింది కానీ తాజా పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది . రష్మిక – రక్షిత్ ల వివాహనిశ్చితార్థం రద్దు అయినట్లు ఓ ఆంగ్ల పత్రికలో కథనం తాజాగా వచ్చింది మరి ఈ వార్తపై రష్మిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి . ప్రస్తుతం ఈ భామకు తెలుగులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది గీత గోవిందం సక్సెస్ తో .

English Title: rumours on rashmika mandanna