ఆ హీరోయిన్ కి పొగరే

rumours on sai pallaviఫిదా తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన మలయాళ భామ సాయి పల్లవి కి ఎక్కడా లేని పొగరు అని ఆమె చిన్న హీరోలను మాత్రమే కాదు అగ్ర హీరోలను సైతం లెక్క చేయడం లేదని అలాగే దర్శకులను సైతం పట్టించుకోవడం లేదని గౌరవం ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . అంతెందుకు మన తెలుగు హీరో నాగశౌర్య కూడా సాయి పల్లవి బాధితుడే ! అతడే స్వయంగా సాయి పల్లవి వ్యవహార శైలి గురించి చెప్పాడు ఇక ఇప్పుడేమో తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది . ఒకటేమో సూర్య సరసన మరొకటి ధనుష్ తో దాంతో తమిళనాట కూడా ఈ గుసగుసలు వినిపిస్తున్నాయి .

 

అయితే ఈ వార్తలు సాయి పల్లవి చెవిన పడినట్లున్నాయి దాంతో ఎట్టకేలకు స్పందించింది . నాకు పొగరు అని అంటున్నారు కానీ నాకు అలాంటిదేమి లేదు . అయితే నేను అంత తొందరగా అందరితో కలిసి పోను అంతెందుకు నాకు హీరో సూర్య అంటే పిచ్చి , ఆయన నా అభిమాన నటుడు కానీ ఆయన సరసన నటిస్తూ కూడా మొదటి రోజు అస్సలు ఆయన తో మాట్లాడలేదు ఎందుకంటే అతడ్ని కళ్లారా చూస్తున్నా అనే ఫీలింగ్ లో ఉండిపోయా ….. ఆయనేమో ఓ చిరు నవ్వు నవ్వి వెళ్లిపోయారు . అని వివరించి చెబుతోంది మరి . సాయి పల్లవి వెర్షన్ ఇలా ఉండగా హీరోలు మాత్రం సాయి పల్లవి కి పొగరు ఎక్కువే అని అంటున్నారట .