ఇన్సూరెన్స్ కోసమే సైరా సెట్ తగులబెట్టారా ?


సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నాడు . కాగా ఇటీవలే నార్సింగ్ – కోకాపేట సమీపంలోని చిరు ఫామ్ హౌజ్ లో వేసిన సైరా సెట్ కాలి బూడిద అయిన విషయం తెలిసిందే . అయితే కోకాపేట సమీపంలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం సైరా సెట్ తగలబడటానికి కారణం ఇన్సూరెన్స్ సొమ్ము అని తెలుస్తోంది .

భారీ సెట్ వేశారు కాగా ఆ సెట్ లో దాదాపుగా షూటింగ్ మొత్తం అయిపొయింది దాంతో ఇన్సూరెన్స్ కోసం ఇలా చేసి ఉంటారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇది అనుమానం మాత్రమే ! ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం కూడా విదితమే ! అయితే ఈ అనుమానాలు పటాపంచలు కావాలంటే పోలీసులు విచారణ చేస్తే సరిపోతుంది . ఏది ఏమైనా సైరా నరసింహారెడ్డి కి ఈ రూపంలో దిష్టి కూడా పోయి ఉంటుంది ……. భారీ విజయం కోసం .