కన్నడ కేజీఎఫ్ 2 లో విజయ్ దేవరకొండ ?


Vijay Devarakonda And Yash
Vijay Devarakonda And Yash

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కన్నడ కేజీఎఫ్ 2 లో నటించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు దాంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి కన్నడనాట .

ఇటీవల తన డియర్ కామ్రేడ్ చిత్ర ప్రమోషన్ కోసం బెంగుళూర్ వెళ్ళాడు విజయ్ దేవరకొండ . కాగా ఆ వేడుకకు కన్నడ స్టార్ హీరో యష్ హాజరయ్యాడు ఇంకేముంది వీటికి రెక్కలొచ్చాయి . యష్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి . ఒకవేళ విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పియరెన్స్ కనుక ఇస్తే కన్నడనాట కూడా విజయ్ తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడం ఖాయమే అవుతుందేమో మరి .