ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై సరికొత్త రూమర్.. నిజమెంత?


ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై సరికొత్త రూమర్.. నిజమెంత?
ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై సరికొత్త రూమర్.. నిజమెంత? ( Image Courtsey: RRRMovie )

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం బల్గేరియాలో నిరవధికంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి ప్రేక్షకులకు ఎగ్జైట్ చేస్తోంది. అదే వచ్చే నెల 22న ఉద్యమకారుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా చిత్రంలో ఆ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ వార్తల్లో నిజమెంతో రాజమౌళికే తెలియాలి. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ నుండి ఎటువంటి ప్రకటనా లేదు. వచ్చే వేసవికి విడుదల కానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే.