పది కోట్ల షేర్ సాధించిన ఆర్ ఎక్స్ 100


RX 100 11 Days world wide Collections

పదకొండు రోజుల్లో పది కోట్ల షేర్ సాధించి ప్రభంజనం సృష్టించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . కొత్త హీరో కొత్త హీరోయిన్ ఆపై దర్శక నిర్మాతలు కూడా కొత్తవాళ్లు అయినప్పటికీ అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది . జూలై 12న విడుదలైన ఈ చిత్రానికి యువతరం బ్రహ్మరధం పడుతున్నారు , దాంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా నటించగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది . ఇక ఈ విజయంలో పాయల్ రాజ్ పుత్ దే అగ్ర తాంబూలం .

సీరియల్ లలో నటించే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో అందాలను ఆరబోసి , ఘాటు లిప్ లాక్ లు కౌగిలింతలు ఇచ్చి సంచలనం సృష్టించింది . రొమాంటిక్ సీన్స్ కుర్రాళ్ళని విపరీతంగా అలరిస్తున్నాయి దాంతో విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా 10. 15 కోట్ల షేర్ వసూల్ చేసింది ఆర్ ఎక్స్ 100 చిత్రం .
ఏరియాల వారీగా ఆర్ ఎక్స్ 100 షేర్ ఇలా ఉంది

నైజాం : 4.54 కోట్లు

సీడెడ్ : 1.14 కోట్లు

వైజాగ్ : 1.03 కోట్లు

గుంటూరు : 0.59 లక్షలు

ఈస్ట్ : 0.72 లక్షలు

వెస్ట్ : 0.57 లక్షలు

కృష్ణా : 0.60 లక్షలు

నెల్లూరు : 0.23 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.38 లక్షలు

ఓవర్ సీస్ : 0.35 లక్షలు

వరల్డ్ వైడ్ కలెక్షన్లు : 10.15 కోట్లు

English Title: RX 100 11 Days world wide Collections