11 కోట్ల దిశగా ఆర్ ఎక్స్ 100


RX 100 15 Days Collections

కార్తికేయపాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఘనవిజయం సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . మొత్తం మీద 11 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది . కేవలం 2 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ ఆర్ ఎక్స్ 100 చిత్రం రూపొందింది . ఈ కథ ని వినమని , సినిమా చేయమని హీరో విజయ్ దేవరకొండ ని అలాగే సుధీర్ బాబు ని అడిగాడట దర్శకుడు అజయ్ భూపతి . కానీ అతడి కథ వినడానికి , సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు ఈ హీరోలు దాంతో కొత్తవాడు అయిన కార్తికేయ తో ఆర్ ఎక్స్ 100 సినిమా చేసాడు .

కట్ చేస్తే మొదటి రోజు నుండే భారీ వసూళ్ల ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల షేర్ రాబట్టింది . 2 కోట్లతో తీసిన సినిమాకు కలెక్షన్ల పరంగానే 9 కోట్ల లాభం ఆ తర్వాత శాటిలైట్ , డబ్బింగ్ , రీమేక్ , డిజిటల్ రైట్స్ రూపంలో ఇంకా చాలా పెద్ద మొత్తమే వస్తోంది ఆర్ ఎక్స్ 100 చిత్రానికి . పాయల్ రాజ్ పుత్ గ్లామర్ , అజయ్ భూపతి డైరెక్షన్ వెరసి ఈ చిన్న చిత్రాన్ని పెద్ద చిత్రంగా చేసాయి . ఈ సినిమాని కొన్న బయ్యర్లు భారీ లాభాలు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు .

English Title: RX 100 15 Days Collections