అల్లు అర్జున్ సరసన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ


RX 100 beauty payal rajput romance with allu arjun

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేకించింది . కాగా ఆ సినిమా తర్వాత ఈ హాట్ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . కాగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ఈ భామకు వచ్చిందని అంటున్నారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విడుదల కాగా తాజాగా హ్యాట్రిక్ కోసం మరోసారి కలుస్తున్నారు అల్లు అర్జున్ -త్రివిక్రమ్ . అయితే ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది కాబట్టి ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . మొత్తానికి ఈ వార్త నిజమే అయితే పాయల్ రాజ్ పుత్ కెరీర్ మరో లెవల్ కు వెళ్ళినట్లే ! అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అంటే పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే !

English Title: RX 100 beauty payal rajput romance with allu arjun