ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు


rx 100 director fires on review writers

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అజయ్ భూపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . మొదటి మూడు రోజుల్లో రివ్యూ లు రాకుండా , రాయకుండా బ్యాన్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు అజయ్ భూపతి . జూలై 12న ఆర్ ఎక్స్ 100 చిత్రం విడుదలైంది అయితే రివ్యూలు అంతగా బాగో రాలేదు కానీ వసూళ్లు మాత్రం దిమ్మ తిరిగేలా వస్తున్నాయి . ఇప్పటివరకు 9 కోట్లకు పైగా షేర్ సాధించి ట్రేడ్ విశ్లేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . ఇక తాజాగా విశాఖపట్టణం లో ఆర్ ఎక్స్ 100 చిత్ర విజయోత్సవ వేడుకలు నిర్వహించారు కాగా ఆ వేడుకలో రివ్యూ లపై బ్యాన్ విధించాలని మంత్రి ఘంటా శ్రీనివాసరావు ని కోరాడు అజయ్ భూపతి .

దర్శకుడి అభ్యర్ధన కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కూడా స్పందించాడు . సినిమా విడుదలైన మూడు రోజుల పాటు రివ్యూ లు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆమేరకు ముఖ్యమంత్రి తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసాడు మంత్రి ఘంటా . సినిమాలో ఉన్న కంటెంట్ ని చూడకుండా కేవలం కొద్దీ నిమిషాల పాటు ఉన్న రొమాన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకొని విమర్శలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు అజయ్ భూపతి . ఈ దర్శకుడు ఇంతకుముందు కూడా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఇప్పుడేమో మీడియా పై విమర్శలు చేస్తున్నాడు .

English Title: rx 100 director fires on review writers