ఆర్ ఎక్స్ 100డైరెక్టర్ కు కారు గిఫ్ట్


rx 100 director gets expensive giftఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి కి తాజాగా ఆ చిత్ర నిర్మాత అశోక్ కొత్త కారు ని బహుమతి గా అందించాడు . దాదాపు 30 లక్షల విలువైన జీప్ కొత్త మోడల్ కారు ని బహుమతి గా ఇవ్వడంతో నా నిర్మాత ఇచ్చిన బహుమతి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు దర్శకులు అజయ్ భూపతి . ప్రస్తుతం జీప్ కొత్త మోడల్ కారు ట్రెండ్ అవుతోంది . బెంజ్ కారులా పోలి ఉండటమే కాకుండా స్టైలిష్ గా ఉంది ఈ కారు దాంతో ఆ కారు కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ప్రస్తుతం మహా నగరాలైన ఢిల్లీ , ముంబై , కోల్ కతా , చెన్నై , హైదరాబాద్ లలో జీప్ రచ్చ రచ్చ చేస్తోంది కాగా అదే కారు ని గిఫ్ట్ గా ఇచ్చాడు నిర్మాత అశోక్ .

ఇక అజయ్ భూపతి కి మరో లక్కీ ఏంటంటే ….. ఈనెల లోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు . తన కు బాగా పరిచయమున్న శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈనెల 25న . బిటెక్ పూర్తిచేసిన శిరీష తో ప్రేమాయణం సాగిస్తున్నాడు ఈ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు . ఆత్రేయపురం లో పెళ్లయ్యాక మళ్ళీ ఇక్కడ సినీ ప్రముఖులకు ఆతిధ్యం ఇవ్వనున్నాడు . ఆర్ ఎక్స్ 100 తో డైరెక్టర్ గా సంచలనం సృష్టించిన అజయ్ కి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి . అయితే ముందు పెళ్లి తర్వాత సినిమాలు అనే ఆలోచనలో ఉన్నాడు ఈ దర్శకుడు .

English Title:  rx 100 director gets expensive gift