గురువు ని తిట్టిన ఆర్ ఎక్స్ 100 దర్శకుడు


RX 100 director sensational comments on ramgopal varma

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట మరో సంచలనం సృష్టించిన వ్యక్తి అజయ్ భూపతి . కాగా ఈ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అయితే అతడ్ని మాత్రం నీచుడు , దుర్మార్గుడు అంటూ తిడుతున్నాడు . ఎందుకో తెలుసా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోషల్ మీడియాకి ఎక్కడం విమర్శలకు దిగడం ముమ్మాటికీ రాంగోపాల్ వర్మ చేస్తున్న పని తప్పు అని కుండబద్దలు కొట్టేసాడు అయితే అదే సమయంలో వర్మ గొప్పవాడు కూడా అని అంటున్నాడు . వర్మ ఎంత నీచుడో అంతే గొప్పవాడు అందుకే ఒకవేళ నేను బయోపిక్ తీయాల్సి వస్తే అది రాంగోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అయితే అందులో అతడి మంచి తో పాటుగా చెడుని కూడా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు అజయ్ భూపతి .

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడి కి పలు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి . 2 కోట్లతో తీసిన సినిమాకు 18 కోట్ల లాభాలు వచ్చేసరికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చేసింది . అయితే అన్ని సినిమాలు ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేయాలనీ భావిస్తున్నాడట అజయ్ భూపతి . తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఈ దర్శకుడి కి .

English Title : rx 100 director sensational comments on ram gopal varma