ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు షాక్ ఇస్తున్న హీరోలు

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ కు షాక్ ఇస్తున్న హీరోలు
Ajay Bhupathi, Naga Chaitanya and Samantha

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి కి అంతగా కాలం కలిసి రావడం లేదు పాపం . ఎందుకంటే ఈ డైరెక్టర్ తో పలువురు హీరోలు సినిమాలు తీయడానికి ప్లాన్ చేసారు కట్ చేస్తే ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు . ఇప్పటికే హీరో రామ్ సినిమా చేద్దామని చెప్పి హ్యాండ్ ఇవ్వగా , ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా హ్యాండ్ ఇచ్చాడట అజయ్ భూపతి కి .

ఇక ఇప్పుడేమో అక్కినేని నాగచైతన్య వంతు వచ్చింది అని అంటున్నారు . అజయ్ భూపతితో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు నాగచైతన్య అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైతూ కూడా షాక్ ఇచ్చాడట ! వెంకీ మామ చిత్రం చేస్తున్న చైతూ వరుసగా మరో మూడు సినిమాలకు డేట్స్ కేటాయిస్తున్నారు కానీ అజయ్ భూపతి కి మాత్రం డేట్స్ ఇవ్వలేదు దాంతో అజయ్ భూపతి కి షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు . సూపర్ హిట్ చిత్రం తీసిన దర్శకుడికి కూడా రెండో సినిమాకు ఇన్ని ఇబ్బందులు అంటే పాపం ! ఏంటో ఆ దర్శకుడి పరిస్థితి .