ఆర్ ఎక్స్ 100 హీరోని మోసం చేశారట


rx 100 hero karthikeya strange experience ఆర్ ఎక్స్ 100 చిత్రంలో హీరోగా నటించి తొలిచిత్రం తోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు కార్తికేయ అయితే ఈ సినిమాకంటే ముందు సినిమాల్లో నటించాలని చాలా ప్రయత్నాలు చేసాడట కార్తికేయ . అయితే ఆ సమయంలో చాలామంది హీరోగా ఛాన్స్ ఇస్తామని చెప్పారట కానీ ఎవరూ ఇవ్వలేదు ఇక ఒకరేమో హీరో ఛాన్స్ ఇస్తానని చెప్పి లక్ష రూపాయలు తీసుకున్నాడట ! అంతేకాదు లక్ష రూపాయలు తీసుకొని సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసారని మళ్ళీ వాళ్ళు కనబడలేదని ఆరోపణలు చేస్తున్నాడు ఈ హీరో .

సినిమా రంగంలో సహజంగానే మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు , ఛాన్స్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకునే రకం చాలామంది ఉన్నారు అలాగే తక్కువ డబ్బులు ఖర్చు అయితే ఎక్కువ మొత్తం ఖర్చు చూపించి నొక్కేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అంతెందుకు రంగస్థలం చిత్రంలో పాడిన సింగర్ కు డబ్బులు ఇవ్వకుంటే ఆమె మీడియా ముందుకు వస్తే సుకుమార్ స్పందించి డబ్బులు ఇచ్చాడు . అంతకుముందు ఇచ్చిన డబ్బు ని మధ్యవర్తి నొక్కేసాడు …… ఇలా చెప్పుకుంటూ పొతే వేలు . లక్షల సంఖ్యలో సంఘటనలు ఉంటాయి అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే !

English Title: rx 100 hero karthikeya strange experience