నాని పాలిట విలన్ గా మారిన ఆర్ ఎక్స్ 100 హీరో


RX 100 hero Karthikeya turned villain for nani

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో కార్తికేయ నాని పాలిట విలన్ గా తయారయ్యాడు . తాజాగా నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆ చిత్రంలో విలన్ గా కార్తికేయ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట విక్రమ్ కుమార్ అనుకున్నదే తడవుగా కార్తికేయ ని అడిగాడట కూడా .

 

ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత హిప్పీ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు కార్తికేయ . తెలుగు , తమిళ బాషలలో రూపొందుతోంది ఆ చిత్రం ఇక విక్రమ్ కుమార్ ఛాన్స్ ఇవ్వగానే కార్తికేయ కూడా ఆసక్తి చూపించాడట . భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం నానికి చాలా స్పెషల్ ఎందుకంటే విక్రమ్ కుమార్ విలక్షణ దర్శకుడు మరి .

English Title: RX 100 hero Karthikeya turned villain for nani