హిప్పీ టీజర్ తో రానున్న ఆర్ ఎక్స్ 100 హీరో


RX 100 hero Karthikeya's Hippi teaser gets release date

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో కార్తికేయ . ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్నాడు కార్తికేయ . ఇక ఈ చిత్ర టీజర్ ని ఈనెల 20 న రిలీజ్ చేయనున్నారు . తెలుగు , తమిళ బాషలలో రూపొందుతున్న హిప్పీ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .

 

ఒక్క చిత్రంతోనే ఊహించని స్టార్ డం ని అందుకున్నాడు కార్తికేయ దాంతో వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి . అయితే అన్ని సినిమాలను ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా ఎంచుకుంటున్నాడు ఈ హీరో . తెలుగులోనే కాకుండా హిప్పీ తో తమిళనాట కూడా ప్రూవ్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాడు . ఈనెల 20 న హిప్పీ టీజర్ రానుంది , మరి ఈ సినిమా కార్తికేయకు హిట్ నిస్తుందా ? లేదా చూడాలి .

English Title : RX 100 hero Karthikeya’s Hippi teaser gets release date