ఆర్ ఎక్స్ 100 హిందీ టైటిల్ ఏంటో తెలుసా


RX 100 hindi remake gets title

తెలుగునాట సంచలన విజయం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100 . గత ఏడాది రిలీజ్ అయిన ఆర్ ఎక్స్ 100 కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కానీ రిలీజ్ అయ్యాక మాత్రం 20 కోట్లకు పైగా వసూల్ చేసింది ఆర్ ఎక్స్ 100 . దాంతో ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది . అంతేనా డబ్బింగ్ , రీమేక్ రైట్స్ కోసం కూడా పోటీ ఎదురయ్యింది , ఆ పోటీలో చివరకు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు .

 

ఇక ఈ సినిమాకు టైటిల్ ఏంటో తెలుసా ……. ” తడప్ ” . అవును ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో ” తడప్ ” గా రీమేక్ చేయనున్నారు . ఇక ఈ సినిమా ద్వారా  సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి హీరోగా పరిచయం కానున్నాడు . తారా సుతారియా హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహించనున్నాడు . ఈ చిత్రం మేలో సెట్స్ మీదకు వెళ్లనుంది . తెలుగులో సంచలనం సృష్టించిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి .

English Title : RX 100 hindi remake gets title

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry