బాహుబలి రికార్డ్ ని బద్దలుకొట్టిన ఆర్ ఎక్స్ 100


RX 100 movie beats baahubali 2 records

బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది ఏమాత్రం అంచనాలు లేని ఆర్ ఎక్స్ 100 చిత్రం. ఆర్ ఎక్స్ 100 బాహుబలి 2 ని బద్దలు కొట్టడం ఏంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో మొదటి వారంలో బాహుబలి 2 చిత్రం 28, 82,370 రూపాయల ను వసూల్ చేయగా దాన్ని అధిగమించి ఆర్ ఎక్స్ 100 చిత్రం ఏకంగా 29, 32, 867 లక్షల గ్రాస్ ని వసూల్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకుముందు దేవి థియేటర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా బాహుబలి 2, తొలిప్రేమ చిత్రాలు నిలిచాయి అయితే ఆ రెండు చిత్రాల రికార్డుల ను బద్దలు కొట్టి కొత్త రికార్డ్ సృష్టించింది ఆర్ ఎక్స్ 100 చిత్రం.

అంతా కొత్తవాళ్ళ తో తెరకెక్కిన ఈ చిత్రం పై మొదట పెద్దగా అంచనాలు లేవు. అయితే టీజర్ , ట్రైలర్ లతో కాస్త యువత ని టార్గెట్ చేశారు కట్ చేస్తే సినిమా విడుదల అవడం , యువత బ్రహ్మరథం పట్టడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఆర్ ఎక్స్ 100 చిత్రం. పాయల్ రాజ్ పుత్ అందాలు కుర్రాళ్ళ ని కట్టి పడేస్తున్నాయి. భారీ ఎత్తున లిప్ లాక్ లు ఘాటు కౌగిలింతలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ గా నిలిచాయి. అజయ్ భూపతి కి దర్శకుడి గా మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో అతడికి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. చిన్న చిత్రంగా వచ్చిన ఆర్ ఎక్స్ 100 సంచలనం సృష్టిస్తు ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

English Title: RX 100 movie beats baahubali 2 records