ఆర్ ఎక్స్ 100 హిందీ రీమేక్ లో సునీల్ శెట్టి తనయుడు!!


rx 100 movie hindi remake
rx 100 movie hindi remake

కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆర్ ఎక్స్ 100′. తక్కువ బడ్జెట్ లో రూపొంది చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది.

బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 లో నటించిన తారా సుతారియా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

మిలన్ లుత్రియా దర్శకత్వంలో యాక్షన్ రొమాంటిక్ డ్రామా, బోల్డ్ స్టోరీ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తెలుగులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ల మధ్య వచ్చే లవ్ సీన్స్ యూత్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. హిందీలో కూడా అంతకంటే ఎక్కువ బోల్డ్ కంటెంట్ తో దర్శకుడు మిలన్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆగష్ట్ 6న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. అహాన్ అన్ని విధాలుగా శివ క్యారెక్టర్ కి సూట్ అవుతాడని సాజిద్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. శెట్టి తరంలో మరో యువ నటుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావడం సునీల్ శెట్టి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు..!!