సంవత్సరం పూర్తిచేసుకున్న ఆర్ ఎక్స్ 100!!

rx100 365 days
rx100 movie pic

కార్తికేయ హీరోగా అందాలభామ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంఆర్ ఎక్స్ 100″. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం  బ్లాక్ బస్టర్ హిట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎక్సిబిటర్స్ కి కాసుల పంట కురించింది ఈ చిత్రం. సరిగ్గా ఈ చిత్రం విడుదలై నేటికి సంవత్సరం అయింది. అయినా మొన్ననే ఈ చిత్రం విడుదలైందా అనిపిస్తోంది. దానికి కారణం ఈ చిత్రంలోని పాటలు. ట్యూన్ మొయిన్ స్వరపరిచినమబ్భులోన వనవిల్లులా.. మట్టిలోనే నీటిజల్లులాపాట సంగీత ప్రియులను ఎంత గానో ఆకట్టు కుంది. అజయ్ భూపతి టేకింగ్ సినిమాకి వన్ అఫ్ ది హైలెట్ గా నిలిచింది!!