ఆ భామ అందాల కోసం కుర్రాళ్ళు ఎగబడుతున్నారు


RX 100 telugu movie two days collectionsజూలై 12న ఆర్ ఎక్స్ 100 చిత్రం విడుదలైంది , అయితే విడుదలకు ముందే ఘాటు లిప్ లాక్ లతో ఘాటు కౌగిలింతలతో కుర్రాళ్ళని ఆకర్షించింది ఆ సినిమా పోస్టర్ దానికి తోడు టీజర్ , ట్రైలర్ కూడా యమా ఘాటుగా ఉండటంతో కుర్రాళ్ళు పాయల్ రాజ్ పుత్ అందాల కోసం ఎగబడుతున్నారు . మొన్న విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ని కట్టబెట్టారు కుర్రాళ్ళు , ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపించి సత్తా చాటారు . మొదటి రోజున కోటి 42 లక్షల షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం రెండో రోజున కూడా కోటి కి పైగా షేర్ వసూల్ చేసి మరింత ఆశ్చర్యపరిచింది .

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కినప్పటికీ బోల్డ్ సీన్స్ చాలా ఉండటంతో కుర్రాళ్లు ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు . పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కార్తికేయ నటన వెరసి యూత్ ని ఆకట్టుకుంటోంది .

రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 50 లక్షల షేర్
సీడెడ్ – 12 లక్షల షేర్
కృష్ణా – 6. 72 లక్షలు
గుంటూరు – 7 లక్షలు
ఈస్ట్ – 9. 72 లక్షలు
వెస్ట్ – 5. 65 లక్షలు
నెల్లూరు – 3 లక్షలు
ఉత్తరాంధ్ర – 14 లక్షలు
మొత్తం రెండు రోజుల్లో 2. 5 కోట్ల షేర్

English Title: RX 100 telugu movie two days collections