పెళ్లి చేసుకున్న ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్


rx100 director ajay bhupathi starts new life

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యాడు . నిన్న కొద్దిమంది సమక్షంలో లక్ష్మి శిరీష ని పెళ్లి చేసుకున్నాడు . ఈ పెళ్లి కి పెళ్లి కూతురు బంధువులు , పెళ్ళికొడుకు బంధువులు తప్ప మిగతావాళ్ళు ఎవ్వరూ హాజరుకాలేదు , అలాగే దర్శకుడు కూడా ఎవ్వరిని పిలవలదు . సింపుల్ గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ , నిర్మాత లతో పాటుగా ఆ సినిమాకు పనిచేసిన కొంతమంది మాత్రమే హాజరయ్యారు .

గతనెలలో విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించాడు అజయ్ భూపతి . కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిత్రం పన్నెండు కోట్లకు పైగా షేర్ ని సాధించింది దాంతో రూపాయి పెట్టిన వాళ్లకు 12 రూపాయల చొప్పున లాభాలు వచ్చాయి . చిన్న చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించడంతో ఈ దర్శకుడికి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి దాంతో మరో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడు . అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కొద్దిరోజులు కొత్త జీవితం లోని మధుర క్షణాలను ఆస్వాదించాక మళ్ళీ మెగా ఫోన్ చేతబట్టాలని అనుకుంటున్నాడట .

English Title: rx100 director ajay bhupathi starts new life