సందీప్ వంగ `యానిమ‌ల్‌` రిలీజ్‌కి టైమ్ ఫిక్స్‌!

S‌‌andeep reddy vanga announces animal movie release date
S‌‌andeep reddy vanga announces animal movie release date

టాలీవుడ్‌లో `అర్జున్‌రెడ్డి మూవీతో పాథ్ బ్రేకింగ్ మూవీని అందించి సంచ‌ల‌నం సృష్టించారు సందీప్ వంగ‌. ఈ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఆయ‌న ఇదే చిత్రాన్ని హిందీలో `క‌బీర్ సింగ్‌` పేరుతో హిందీలో  రీమేక్ చేశారు. షాహీద్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఏడాదిన్న‌ర విరామం త‌రువాత సందీప్ వంగ పాన్ ఇండియా స్థాయి మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

`యానిమ‌ల్‌` పేరుతో రూపొందుతున్న ఈ మూవీతో ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తుండ‌గా హీరోయిన్ గా ప‌రిణీతి చోప్రా, కీల‌క పాత్ర‌ల్లో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇటీవ‌ల ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ టీజర్‌, టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. యానిమ‌ల్ లాంటి ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ మూవీని ద‌స‌రా క‌నుక‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ సోమ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది ద‌స‌రాకు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. టి. సిరీస్‌, వంగ పిక్చ‌ర్స్ ప భూష‌ణ్‌కుమార్‌, ప్ర‌ణ‌య్ వంగ‌, ముర‌ద్ ఖేతాన్‌, కృష్ణ‌కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.