మోహన్ బాబు అప్పుడు తిడితే ఇప్పుడు స్పందించాడు


s thaman responds on mohanbabu comments

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ని తిట్టాడు నటుడు , నిర్మాత మోహన్ బాబు . గాయత్రి అనే సినిమా లో మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే కాగా ఆ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు . అయితే తమన్ పాటలు ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నాడని , అతడంత బద్ధకస్థుడు లేనే లేరని అంతేకాదు అతడితో పనిచేయడం నాలాంటి వాడికి చాలా కష్టమని తమన్ పై ఆరోపణలు చేసాడు మోహన్ బాబు .

 

అయితే మోహన్ బాబు ఈ ఆరోపణలు చేసి నెల రోజులు కావస్తోంది అయితే అప్పుడు పెద్దగా స్పందించలేదు తమన్ కానీ ఎట్టకేలకు తాజాగా ఈ తిట్ల పై స్పందించాడు తమన్ . మోహన్ బాబు లాంటి పెద్దలు నన్ను తిట్టినా అది ఆశీర్వాదంగానే భావిస్తానని , ఆయన తిట్లు నాకు దీవెనలతో సమానమని అంటున్నాడు . మంచి పాటలు అందించాలన్న ఆలోచనతో గాయత్రి సినిమాకు పాటలు ఆలస్యంగా ఇచ్చానని అంతేకాని మరో కారణం లేదని అంటున్నాడు తమన్ .