కేవలం మూడు రోజుల్లోనే 294 కోట్లతో దుమ్మురేపుతోన్న సాహోsaaho 3days in 294 crores
saaho 3days in 294 crores

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సాహో చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విదులైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా కూడా సాహో దుమ్ములేపే కలెక్షన్స్ సాధిస్తోంది. రెండురోజుల్లో 205 కోట్లు సాధించిన ఈ చిత్రం మూడు రోజుల్లో 294 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

నెల్లూరులో సైతం ఈ చిత్రం బాహుబలి-2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ మూడు రోజుల్లోనే కోటి 1.34 లక్షల గ్రాస్ రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే నెల్లూరు సిటీలో ఇక్కడ 71.76 లక్షల షేర్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్స్ దిశగా దూసుకెళ్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సాహో చిత్రం వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడురోజులకు 294 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.. ఈ చిత్రం సక్సెస్ ని టీం అంత కూడా ఎవరికి వాళ్ళు ఇన్డిడ్యువల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ముంబయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ హీరోయిన్ శ్రద్ద కపూర్ తో కలిసి ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.. మరి సాహో మున్ముందు ఎంత కలెక్ట్ చేస్తుందోనని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు…!!