సాహో డిజిటల్ రిలీజ్ డేట్ అప్పుడే


సాహో డిజిటల్ రిలీజ్ డేట్ అప్పుడే
సాహో డిజిటల్ రిలీజ్ డేట్ అప్పుడే

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తో మొదలైంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ కథలో క్లారిటీ లేదని క్రిటిక్స్ తేల్చేసారు. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని ప్రాంతాల్లో ప్లాప్ ముద్ర వేయించుకుంది. అయితే ఒక్క హిందీలో మాత్రం ఈ చిత్రం ఊహకందని వసూళ్లతో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం అక్కడ 153 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కేవలం అక్కడ బాహుబలి 1 అండ్ 2 సినిమాల ద్వారానే పరిచయమైన ప్రభాస్ కు ఇది పెద్ద ఫిగర్ అనే చెప్పాలి.

మొత్తంగా చూసుకుంటే 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ప్లాప్ గా మిగిలింది. అయితే ఈ చిత్ర డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం సాహో ప్రైమ్ రిలీజ్ ఈ నెల 19న ఉండనుందని తెలుస్తోంది. సినిమా విడుదలైన 50 రోజులకు సాహో ప్రైమ్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల హక్కులను ప్రైమ్ దక్కించుకోగా, హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ డిజిటల్ రిలీజ్ గురించి ఇంకా ఎటువంటి సమాధానం లేదు.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహోలో భారీ కాస్ట్ ఉంది. శ్రద్ధ కపూర్, అరుణ్ విజయ్, చంకి పాండే, మందిర బేడీ, నీల్ నితిన్ ముఖేష్ వంటి వారు నటించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సాహోను నిర్మించింది.