బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన సాహో


Saaho Collections
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన సాహో

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఫైనల్ రన్ కు చేరుకుంది. మొదటినుండి మిశ్రమ స్పందన వచ్చిన ఈ చిత్రం ఒక్క హిందీలో తప్ప మరెక్కడా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 40 కోట్ల వరకూ నష్టాలను మూటగట్టుకుంటోంది. అయితే సాహో కొన్ని చోట్ల రికార్డులను కూడా తిరగరాసింది లెండి. నెల్లూరు జిల్లాలో సాహో బాహుబలి 1 వసూళ్లను దాటేసింది.

16వ రోజున నెల్లూరులో 1,85,796 రూపాయల షేర్ సాధించిన సాహో మొత్తంగా 4,30,50,033 రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసి బాహుబలి 1 పేరిట ఉన్న 4.30 కోట్ల షేర్ ను దాటేసింది. అయితే బాహుబలి 2 ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. సాహో ఫైనల్ రన్ కు చేరుకోవడంతో ఇక బాహుబలి 2 ను దాటడం అసాధ్యమనే చెప్పాలి.

Credit: Twitter