డిజిటల్ రైట్స్ లో సంచలనం సృష్టించిన సాహో


Saaho
Saaho

డిజిటల్ రైట్స్ లో సరికొత్త సంచలనం సృష్టించింది సాహో . అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సాహో కోసం ఏకంగా 40 కోట్లకు బేరం కుదుర్చుకుందట . శాటిలైట్ రైట్స్ తో పాటుగా పెద్ద సినిమాలకు డిజిటల్ రైట్స్ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే .అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ ల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి పడుతున్నాయి .

ఇక సాహో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి గట్టి పోటీ ఎదురయ్యింది . దాంతో అమెజాన్ 40 కోట్లకు సాహో ని సొంతం చేసుకుంది . ప్రభాస్ – శ్రద్దా కపూర్ జంటగా నటించిన సాహో ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది .