సాహో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Saaho First Review by Umair Sandhu the Member of UK Censor Board
Saaho First Review by Umair Sandhu the Member of UK Censor Board

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ఆగస్టు 30 న విడుదల అవుతున్న సందర్బంగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది . ఇక ఈ రివ్యూ ని ఇచ్చింది ఎవరో తెలుసా ……. యూకే సెన్సార్ బోర్డు మెంబర్ వివాదాస్పద రివ్యూ రైటర్ ఉమైర్ సందు సాహో ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. యూకే లో విడుదల కావాలంటే అక్కడ కూడా మళ్ళీ సెన్సార్ చేయాల్సిందే. ఆ సెన్సార్ బోర్డు లో ఉమైర్ కూడా మెంబర్ కావడంతో అలా సినిమా చూడటమే ఆలస్యం ఇలా రివ్యూ ఇచ్చి పడేస్తుంటాడు.

ఇంతకీ ఉమైర్ సందు రివ్యూ ఎలా ఉందంటే …… సాహో ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఒక్క ముక్కలో తేల్చాడు. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్ లో ఉందని , భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని , మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో సాహో పైసా వసూల్ చిత్రమని సింఫుల్ గా చెప్పాలంటే ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నాడు.

అయితే ……..

ఉమైర్ సందు సూపర్ ….. బంపర్ …… డంపర్ …… అంటూ చెక్క భజన చేసిన సినిమాలన్నీ ఘోర పరాజయాలు పొందాయి. డిజాస్టర్ లుగా నిలిచిన చిత్రాలకు సైతం భారీ రేటింగ్ ఇవ్వడమే కాకుండా సూపర్ ….. ఆహాఁ …… ఓహో అంటూ చిడతలు కొట్టాడు ఉమైర్. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే ….. ఒకటి అరా సినిమాలు హిట్ అయ్యాయి అనుకోండి. కానీ ఉమైర్ సందు సూపర్ అన్న సినిమా సూపర్ ప్లాప్ లే అయ్యాయి. మరి ఈ సాహో ఏమౌతుందో!