తెలుగు రాష్ట్రాల్లో సాహో మొదటి వారం పరిస్థితి ఏంటి?


Saaho Collections
తెలుగు రాష్ట్రాల్లో సాహో మొదటి వారం పరిస్థితి ఏంటి?

రెండేళ్లకు పైగా రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సాహో కోసం ఎదురుచూసారు. భారీ అంచనాల మధ్య గత వారం విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో ప్లాప్ వైపు అడుగులేస్తోంది. హిందీలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా కూడా తెలుగులో మొదటి నాలుగు రోజుల తర్వాత వసూళ్లు నెమ్మదించాయి. అసలు సాహో విడుదలై ఒక వారం పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 74 కోట్ల షేర్ పైచిలుకు వసూళ్లు సాధించింది. ఇంత వచ్చినా కానీ ఈ సినిమాను హిట్ అనలేం. ఆ మాట అనాలంటే మరో 50 కోట్లు రావాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మరో 10 కోట్లు వస్తే ఎక్కువ. అంటే సాహో తెలుగులో డిజాస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళ్ లో అయితే ఈ చిత్ర కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు హిందీలో పరిస్థితి కొంచెం మెరుగు. ఇప్పటిదాక ఈ చిత్రం 120 కోట్ల నెట్ వసూళ్లు సాధించి హిట్ స్టేటస్ సంపాదించుకుంది.