సాహో.. బ్రేక్ ఈవెన్ కు ఎంతో దూరంగా..


Saaho Collections
సాహో.. బ్రేక్ ఈవెన్ కు ఎంతో దూరంగా..

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమైన సంగతి తెల్సిందే. రివ్యూయర్లు ఈ సినిమాను చీల్చి చెండాడేయగా, భారీ అంచనాల కారణంగా మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల సునామి కురిసిన సంగతి తెల్సిందే. ఐదవ రోజు నుండి వసూళ్ళలో డ్రాప్ కనిపించగా, సెకండ్ వీకెండ్ లో సైతం మెరుగుదల లేదు. అయితే హిందీలో ఈ చిత్రం ఇంత నెగటివ్ టాక్ లో సైతం హిట్ అనిపించుకుంది. అక్కడ వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.

అయితే తెలుగులో మాత్రం ప్రభాస్ కు ఇది ప్లాప్ అనే చెప్పాలి. సాహో ఇప్పటివరకూ 80 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమాల వరకూ చూసుకుంటే ఇది భారీ మొత్తమే. అయితే సాహోను భారీ రేట్లకు అమ్మేసిన విషయం తెల్సిందే. 120 కోట్లు వస్తే కానీ సాహో హిట్ అనిపించుకోదు. అంటే ఇంకా 40 కోట్లు రావాలి. ఇప్పటికే రెండవ వారాంతం ముగియడంతో ఇప్పుడున్న పరిస్థితులలో సాహో 100 కోట్లు వసూలు చేయడం కూడా గొప్ప విషయమే. సో, సాహో తెలుగులో చేదు ఫలితాన్ని ఎదుర్కుంటోంది.