ఆ ఫ్యాక్టర్ సాహోకు కలిసొచ్చేలా ఉంది


ఆ ఫ్యాక్టర్ సాహోకు కలిసొచ్చేలా ఉంది
ఆ ఫ్యాక్టర్ సాహోకు కలిసొచ్చేలా ఉంది

దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మొదట మిశ్రమ స్పందనతో మొదలైన విషయం తెల్సిందే. బాలీవుడ్ వర్గాల్లో ఇంకా ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి కానీ తెలుగు మీడియా సాహోను చీల్చి చెండాడేసింది. రేటింగ్ లు కూడా చాలా తక్కువగా ఇచ్చింది.

అయితే సాహో మీద ఉన్న హైప్ కారణంగా మొదటి మూడు రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో అవ్వడంతో తొలి వీకెండ్ అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంతేకాకుండా సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా సెలవు రావడంతో కలెక్షన్స్ కు ఢోకా లేకుండా పోయింది. నిన్న వర్కింగ్ డే అయినా కూడా సాహో కలెక్షన్స్ మరీ దారుణంగా ఏం పడిపోకపోవడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.

దీనికి తోడు ఈ వారాంతం నోటెడ్ సినిమా ఏదీ విడుదల కాకపోవడం సాహోకు కచ్చితంగా కలిసొచ్చేదే. ఇప్పటికే సాహో తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లదాకా వసూలు చేసింది. మరో 40 కోట్లు వసూలు చేస్తే కానీ సాహో ఇక్కడ సేఫ్ అవ్వదు. మరి ఈ నేపథ్యంలో సాహో ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.