నైజాంలో సగానికి పడిపోయిన సాహో కలెక్షన్స్


నైజాంలో సగానికి పడిపోయిన సాహో కలెక్షన్స్
నైజాంలో సగానికి పడిపోయిన సాహో కలెక్షన్స్ ( Image courtesy: uv_creations)

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. విడుదలైన మొదటి రోజు నుండే మిశ్రమ స్పందనతో నడుస్తున్న సాహో హాలిడే అడ్వాంటేజ్ కారణంగా మొదటి ఐదు రోజులు బాగానే వసూలు చేసింది. నైజాంలో అయితే పాతిక కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఇప్పుడు సెలవులు ముగియడంతో సాహో కలెక్షన్స్ కు భారీగా గండి పడింది.

నైజాంలో ఐదవ రోజు కోటి నలభై లక్షలకు పైగా షేర్ సాధించిన సాహో ఆరవ రోజు పూర్తిగా డల్ అయిపోయింది. కనీసం ఐదవ రోజులో సగం షేర్ కూడా రాబట్టలేకపోయింది. కేవలం 61 లక్షల షేర్ మాత్రమే సాధించింది. ఇంకా బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే 17 కోట్లు వసూలు చేయాల్సిన నేపథ్యంలో సాహోకు భారీ నష్టాలు తప్పేలా లేదు. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది.