నైజాంలో ఎదురీదుతున్న సాహో


Saaho movie collections
నైజాంలో ఎదురీదుతున్న సాహో

చేతికి ఎముక లేని చందంగా యూవీ క్రియేషన్స్ సంస్థ సాహో చిత్రాన్ని నిర్మించింది. దాదాపు 350 కోట్ల రూపాయలు ఈ చిత్రంపై ఖర్చు పెట్టిన విషయం విదితమే. అయితే ఖర్చుపై దృష్టి పెట్టినంతగా కథనంపై చిత్ర యూనిట్ దృష్టి పెట్టలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. రివ్యూలు కూడా అంత ఆశాజనకంగా రాలేదు. అయితే ఈ చిత్రంపై మొదటి నుండి నెలకొని ఉన్న హైప్ కారణంగా మొదటి వారాంతం వసూళ్లు అదిరిపోయాయి.

ఆ తర్వాత ఆంధ్ర, సీడెడ్ లో కలెక్షన్స్ మందగించనా నైజాంలో మాత్రం సాహో ప్రభావం చూపుతుంది. పనిదినం అయినా కూడా మంగళవారం సాహో నైజాంలో కోటికి పైగా వసూలు చేసింది. దీంతో సాహో నైజాంలో 25 కోట్ల మార్కును చేరుకున్నట్లైంది. అయితే ఇంత వసూలు చేసినా ఇంకా సాహో దాదాపు 17 కోట్లు సంపాదించాలి. ఎందుకంటే ఒక్క నైజాం హక్కులనే దాదాపు 42 కోట్లకు అమ్మారు. మరి నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంపై ఎంతవరకూ సేఫ్ అవుతారన్నది చూడాలి.

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా సాహో విడుదలైంది.