అక్కడ సేఫ్ జోన్ లోకి వెళుతున్న సాహో


Saaho Collections
అక్కడ సేఫ్ జోన్ లోకి వెళుతున్న సాహో

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి అన్నివైపుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకి సౌత్ ఆడియన్స్ ఒకలా, నార్త్ ఆడియన్స్ ఒకలా, క్లాస్ ప్రేక్షకులు ఒకలా, మాస్ ప్రేక్షకులు ఒకలా రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా సాహో తెలుగు రాష్ట్రాల్లో కన్నా నార్త్ లో దుమ్ములేపుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల నెట్ వసూలు చేసింది. ముఖ్యంగా గుజరాత్, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో కలెక్షన్లు ఆశాజనకంగా ఉంటున్నాయి.

ట్రేడ్ పండితుల విశ్లేషణ ఆధారంగా సాహో చాలా చోట్ల వచ్చే వారాంతానికి సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంది. ఇక సౌత్ లో నైజాంలో కలెక్షన్స్ బావున్నాయి. ఉత్తరాంధ్రలో వీక్ గా ఉన్నాయి. కర్ణాటకలో ఒక మోస్తరు వసూళ్లు వస్తుండగా, తమిళనాడులో పూర్తి డల్ అయిపోయింది. తమిళనాడులో యూవీ క్రియేషన్స్ సొంతంగా విడుదల చేసుకోవడంతో కొంత మేర నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి.

Credit: Twitter