సాహో నుండి హీటేక్కించే పాట


Psycho Saiyaan Video Song
Psycho Saiyaan Video Song Poster

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం నుండి కొద్దిసేపటి క్రితం సైకో సయాన్ అనే పాటని విడుదల చేసారు .ఈ వీడియో సాంగ్ లో ప్రభాస్ యాక్షన్ , శ్రద్దా కపూర్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది . శ్రద్దా కపూర్ తొలిసారిగా తెలుగులో చిత్రంలో నటిస్తోంది అలాగే ప్రభాస్ సరసన కూడా తొలిసారిగా కావడంతో ఆ ఫ్రెష్ నెస్ సరికొత్త ఊపునిచ్చేలా సాగింది .

బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ అందాలు యూత్ ని హీటెక్కిస్తున్నాయి . ఆగస్టు 15 న సాహో విడుదల అవుతున్న నేపథ్యంలో నెల రోజుల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు . తెలుగు , తమిళ , హిందీ బాషలలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక ఇప్పుడు విడుదలైన సైకో సయాన్ పాట యూత్ ని అలరించేలా సాగింది .