మరో ల్యాండ్ మార్క్ చేరుకున్న సాహో


Saaho reaches 150 cr mark in Bollywood
Saaho reaches 150 cr mark in Bollywood

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం తొలిరోజు నుండే నెగటివ్ టాక్ ను తెచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే చిత్రం మీద క్రేజ్ బాగా ఉండడంతో ఓపెనింగ్స్ వరకూ ఢోకా లేకుండా పోయింది. కానీ ఆ తర్వాత సాహో వసూళ్లు నెమ్మదించాయి. అయితే అది సౌత్ వరకే.

నార్త్ లో ఈ చిత్రం అంచనాలను మించి రాణించింది. నిజానికి బాలీవుడ్ రివ్యూయర్లు కూడా సినిమాకు చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ నార్త్ ప్రేక్షకులు అవేమీ పట్టించుకోలేదు. సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ ఓ మాదిరి ఉన్నాయంటే బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తాజా సమాచారం ప్రకారం సాహో బాలీవుడ్ లో మరో ల్యాండ్ మార్క్ ను చేరుకుంది. ఈ చిత్రం అక్కడ 150 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాహో ద్వారా ఒక విషయం అర్ధమైంది. ప్రభాస్ కు బాలీవుడ్ లో స్థిరమైన మార్కెట్ అయితే వచ్చేసింది. ఇక నుండి ప్రభాస్ చేసేవన్నీ ప్యాన్ ఇండియా మూవీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.