సాహో రన్ టైం లాక్


Saaho
Saaho

సాహో రన్ టైం లాక్ చేసారు ఆ చిత్ర బృందం . ఇంతకుముందు 2 గంటల 52 నిమిషాల నిడివి ఉండగా దాన్ని 8 నిముషాలు కుదించి 2 గంటల 46 నిమిషాలకు తగ్గించారట . దాంతో సాహో రన్ టైం 2 గంటల 46 నిమిషాల కు లాక్ చేసారని తెలుస్తోంది . ఇక సెన్సార్ కావడమే తరువాయి ఆగస్టు 30 న సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది .

సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ చిత్రం కోసం దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్ . రెమ్యునరేషన్ విషయాన్నీ దాటేశాడు కానీ ఓ భారీ ఎపిసోడ్ కోసం ఖర్చు పెట్టినంత రెమ్యునరేషన్ తీసుకున్నాను అని చెప్పాడు ప్రభాస్ . ఈ సినిమాలో అబుదాబీ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ప్రభాస్ చెబుతున్న దాని ప్రకారం 80 కోట్లు కానీ బయట వినబడుతున్న దాని ప్రకారం 100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట . ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున సాహో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది .