మొత్తానికి సాహో షూటింగ్ పూర్తి !


Saaho shooting completed
Saaho shooting completed

మొత్తానికి సాహో షూటింగ్ పూర్తి !

హమ్మయ్య ! ఇన్నాళ్లకు సాహో షూటింగ్ ప్యాచ్ వర్క్ తో సహా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది . ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ అయినట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో గ్రూప్ ఫోటో పోస్ట్ చేసారు . ఈ ఫోటోలో ప్రభాస్ కాస్త డిఫరెంట్ గానే కనబడుతున్నాడు . సాహో బృందం కూడా ప్రభాస్ వెనకాల ఉంది . ఇప్పటికే శరవేగంగా సాహో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా మరింత వేగవంతం చేయనున్నారు .

ఎందుకంటే ఆగస్టు 15 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది . ఇక ఈ సాహో బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి . మరి ఈ సాహో ఆ అంచనాలను అందుకుంటుందా ? లేదా అన్నది ఆగస్టు 15 న తేలనుంది .